
మత్స్యకారులకు అండగా ఉంటాం
నక్కపల్లి: వందలాదిమంది పోలీసులను దించారు.. దారులన్నీ దిగ్బంధం చేశారు.. సంఘీభావం తెలిపే నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.. రాజయ్యపేట మత్స్యకారులను ఒంటరి వాళ్లను చేసేందుకు యత్నించారు. వారం రోజులుగా అమలవుతున్న కూటమి నేతల కుటిల నీతిని తుత్తునియలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. మేమున్నామని భరోసా ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో ‘చలో రాజయ్యపేట’కు పిలుపునిచ్చి పార్టీ అగ్ర నేతలు గ్రామాన్ని సందర్శించారు. కడ వరకు మీకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కన్నబాబురాజు, చెంగల వెంకటరావు, తైనాల విజయ్‌కుమార్, పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, సూర్యనారాయణరాజు, సీఈసీ సభ్యులు డాక్టర్ బి.వి.సత్యవతి, రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, పైల శ్రీనివాసరావు, మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్‌లు కోలా గురువులు, పేర్ల విజయచందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జాన్ వెస్లీ, ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ముఖ్యనేతలు శరగడం చినఅప్పలనాయుడు, బోదెపు గోవింద్, జియ్యాని శ్రీధర్, అల్లంపల్లి రాజుబాబు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, మహిళా నేతలు నాగమల్లేశ్వరి, సుందరలత, విశాఖ బోట్ ఆపరేటర్ల సంఘ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, తదితరులు ఉన్నారు.