
నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
డాబాగార్డెన్స్: నగర ప్రజలకు మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు హరిత దీపావళి, స్వచ్ఛ దీపావళి, శుభ దీపావళిని రంగు రంగుల దీపాలతో ఆనందంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. మతాబులు, మందుగుండు సామగ్రిని కాల్చడం వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతుందన్నారు. శబ్ద కాలుష్యం చిన్న పిల్లలు, వృద్ధులు, పశువులు, మూగజీవులకు ఆందోళన కలిగించి ప్రమాదాలకు గురి చేస్తుందని, వాయు కాలుష్యం అనారోగ్యానికి దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. ప్రజలందరూ బాణసంచాకు బదులుగా అందమైన దీపాలు వెలిగించి కాలుష్యం లేని పండగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.