
బస్సులు లేక అప్పన్న భక్తుల అవస్థలు
సింహాచలం: యోగాంధ్ర.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి భక్తులకు తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శనివారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోవడానికి సింహాచలం వచ్చారు. వారిలో పలువురు తిరుపతి, విజయవాడ, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి, తిరుగు ప్రయాణంలో సింహాచలం చేరుకున్నారు. దర్శనం పూర్తవ్వగానే సింహాచలం నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. అయితే వారికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
నెల్లిమర్ల నుంచి వచ్చాం
నెల్లిమర్ల నుంచి 20 మందితో తిరుపతి యాత్రకు వెళ్లిన ఓ భక్తుడు తన ఆవేదనను వెలిబుచ్చారు. ‘మేము మధ్యాహ్నం సింహాచలం చేరుకుని స్వామిని దర్శించుకున్నాం. రాత్రి 8 గంటల సమయంలో విజయనగరం వెళ్లేందుకు సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వచ్చాం. తీరా చూస్తే బస్సులు లేవు. ఎలా వెళ్లాలో తెలియక చాలా గందరగోళంగా ఉంది.’ అని ఆయన వాపోయారు.

బస్సులు లేక అప్పన్న భక్తుల అవస్థలు