
గవర్నర్‌కు స్వాగతం
మహారాణిపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నోవాటెల్‌కు చేరుకున్నారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు నోవాటెల్ నుంచి మహారాణిపేట వెళ్తారు. తిరిగి నోవాటెల్‌కు చేరుకుని సాయంత్రం 5.50 గంటల వరకు అక్కడే ఉంటారు. సాయంత్రం 6.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. శనివారం బీచ్‌రోడ్డులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.