
ప్రభుత్వ కార్యాలయాల్లో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’
మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల ఎలక్ట్రానిక్ వ్యర్థాల తొలగింపు అంశం కావడంతో, ఉద్యోగులు తమ కార్యాలయాల్లోని పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించి జీవీఎంసీకి అందించేందుకు సిద్ధం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌వో భవానీ శంకర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది. జిల్లా పరిషత్‌లో సీఈవో పి.నారాయణమూర్తి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ శ్రీనివాసరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఎస్‌ఈ కె.ఎస్.ఎస్ చౌదరి ఆధ్వర్యంలో ఇదే తరహా కార్యక్రమాలు జరిగాయి.