మహారాణిపేట : అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ అన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రాణాలను కూడా ఫణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన జీవితం అనుసరణీయమన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో భవానీశంకర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి (ఈవో) కె.ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.