ఏయూక్యాంపస్: నగరంలో నివాసం ఉంటున్న మార్వాడీలు హోలీ వేడుకలను ముందుగానే ప్రారంభించారు. గురువారం ఉదయం ఆవు పేడతో చేసిన పిడకలను సముద్ర తీరానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ప్రతీ కుటుంబం నుంచి ఒక పిడకల దండను సేకరించి, వాటి తో సాగరతీరంలో పెద్ద కుప్పగా పేర్చారు. ఈ పిడకల కుప్పకు మహిళలు పూజలు చేశారు. గురువారం రాత్రి 11.34 గంటలకు పిడకలకు నిప్పు వెలిగించి హోలికా దహన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పిడకల నుంచి వచ్చి బూడిదను విభూతిగా భావించి ప్రతి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేశారు. శుక్రవారం జరిగే వేడుకల్లో ఆ విభూతిని నుదుటన తిలకంగా ధరిస్తారు. ఆ తర్వాత మార్వాడీలందరూ కుటుంబ సమేతంగా హోలీ వేడుకల్లో పాల్గొంటారు.
సాగరతీరంలో..సంప్రదాయ హోలీ