● ఉత్సాహంగా చిత్రలేఖనం పోటీలు
కొమ్మాది: గిరిజన స్వాభిమాన ఉత్సవాలు–2025లో భాగంగా రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ మిషన్(టీసీఆర్‌టీఎం) ఆధ్వర్యంలో గాయత్రి కళాశాల ప్రాంగణంలో గిరిజన విద్యార్థులు, కళాకారులకు నిర్వహించిన బుధవారం రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ముందుగా ఈ కార్యక్రమాన్ని టీసీఆర్‌టీఎం ఈడీ డా.రాణిమందా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహ దపడతాయని అన్నారు. ఈ పోటీల్లో 8 ఐటీడీఏల పరిధిలోని 17 జిల్లాల నుంచి 250 మంది పాల్గొన్నారని వెల్లడించారు. ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం ఆచార్యులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని తెలిపారు. నెల్లూరు ఐటీడీఏకు చెందిన సీహెచ్ మణి విజేతగా నిలవగా, పాడేరు ఐటీడీఏకు చెందిన బి.నందిని, ఆర్.రాజేష్‌లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అనంతరం విజేతలకు ఈడీ బహుమతులు ప్రదానం చేశారు. గాయత్రి కళాశాల ప్రొఫెసర్ పి.వి.శర్మ, టీసీఆర్‌టీఎం సభ్యులు పాల్గొన్నారు.
9వ తరగతి విద్యార్థి బాలచందర్ గీసిన చిత్రం
సృజనతో మెరిసి.. విజేతగా నిలిచి..