‘యువత పోరు’తో నిలదీద్దాం.. | - | Sakshi
Sakshi News home page

‘యువత పోరు’తో నిలదీద్దాం..

Mar 11 2025 12:43 AM | Updated on Mar 11 2025 12:42 AM

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు అబద్దపు హామీలిచ్చి అఽధికారం చేపట్టిన తర్వాత యువతను, విద్యార్థులను, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ఉపసంహరణ అంశాలపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ‘యువత పోరు’ పేరిట నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్‌ను సోమవారం ఆవిష్క రించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ మాట్లాడు తూ గతంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన రైతు పోరు బాట, విద్యుత్‌ చార్జీలపై నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, అదే తరహాలో యువత పోరును మరింత విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు, యువతకు పిలుపునిచ్చారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలనే ఆకాంక్షతో మహానేత, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని, దాన్ని ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మరింత సమర్థవంతంగా అమలుచేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4 వేల కోట్లు ఫీజు బకాయి పెట్టిందన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్‌ కాలేజీలు మంజూరై, వాటిలో సగానికి పైగా పూర్తయ్యామని, మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయని, వాటి ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుండటం శోచనీయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్‌, చింతలపూడి వెంకట్రామయ్య, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు జాన్‌వెస్లీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పేడాడ రమణికుమారి, దొడ్డి కిరణ్‌, పులగమ కొండారెడ్డి, సనపల రవీంద్ర భరత్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ షరీఫ్‌, పార్టీ ముఖ్య నాయకులు నాగేంద్ర, మువ్వల సంతోష్‌కుమార్‌, ఇల్లపు శ్రీనివాస్‌, కార్తీక్‌, నిఖిల్‌ వర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

నిరసనకు తరలిరండి

ఈ నెల 12న ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా యువత, తల్లిదండ్రులు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పాల్గొంటాయని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక

రూ.4 వేల కోట్ల ఫీజు బకాయిలు

నిరుద్యోగులకు రూ.3 వేలు భృతిగా ఇస్తామని చెప్పి మాట తప్పారు

12న వైఎస్సార్‌ సీపీ యువత పోరు

పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement