మద్దిలపాలెం: స్థానిక డాక్టర్ వీఎస్ కృష్ణా కళాశాలలో విద్యా సంస్థలతో పారిశ్రామిక వ్యవస్థల అనుసంధానంపై శుక్రవారం సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.విజయబాబు తెలిపారు. ఈమేరకు గురువారం కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 50 పరిశ్రమలు భాగస్వామ్యం కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన అవకాశాలకు సదస్సు దోహదపడుతుందన్నారు. పారిశ్రామిక సంస్థలు ఏ అంశాల్లో విద్యార్థుల నైపుణ్యతను ఆశిస్తున్నాయో తెలుసుకునే వీలుంటుందన్నారు. దానికి అనుగుణంగా విద్యార్థులకు విద్యా సంస్థల్లో శిక్షణ అందించి, ఉద్యోగులుగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.