నలుగురు నేరస్తుల నగర బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

నలుగురు నేరస్తుల నగర బహిష్కరణ

Mar 7 2025 9:05 AM | Updated on Mar 7 2025 9:05 AM

అల్లిపురం: నగరంలో ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పలు తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులకు నగర బహిష్కరణ విధిస్తూ చీఫ్‌ సెక్రటరీ కె.విజయానంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఆర్‌.హెచ్‌.కాలనీకి చెందిన కొలగాని పవన్‌ రాజ్‌ కుమార్‌ అలియాస్‌ పవన్‌, దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధి వడ్లపూడికి చెందిన కాండ్రేగుల లోకనాథ్‌ వీర సాయి శ్రీనివాస్‌ అలియాస్‌ లోకేష్‌, ఎయిర్‌ పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఆర్‌ అండ్‌ బీ ప్రాంతానికి చెందిన రావాడ జగదీష్‌, ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ పరిధి చినగదిలి ప్రాంతానికి చెందిన నక్కా లోకేష్‌ అలియాస్‌ కిట్టులపై ఈ చర్యలు చేపట్టారు. వీరు అక్రమ రవాణా, దోపి డీలు, మాదకద్రవ్యాల వ్యాపారం, గూండాయిజం, అనైతిక కార్యకలాపాలు, భూ కబ్జాలు వంటి అనేక నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వీరంతా అనేక నేరాల్లో శిక్షలు అనుభవించినప్పటికీ, వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెక్షన్‌–3(1) అండ్‌ (2) రెడ్‌ విత్‌ సెక్షన్‌ 2(ఎఫ్‌) అండ్‌ 2(జీ) కింద అక్రమ రవాణాదా రులు, దోపిడీదారులు, మాదక ద్రవ్యాల నేరస్తులు, గూండాలు, అనైతిక రవాణా నేరస్తులు, భూ కబ్జాదారుల చట్టం, 1986(చట్టం నం.1) కింద వీరిని ఏడాది పాటు నగరం నుంచి బహిష్కరిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement