భూదాన్‌ భూములపై | - | Sakshi
Sakshi News home page

భూదాన్‌ భూములపై

Sep 17 2024 2:32 AM | Updated on Sep 17 2024 2:32 AM

భూదాన

భూదాన్‌ భూములపై

వాస్తవానికి పరదేశిపాలెం గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 132లో మొత్తం 50.56 ఎకరాల భూమి ఉంది. ఇది ప్రభుత్వ భూమి అని రికార్డుల్లో స్పష్టంగా ఉంది. పట్టాదారు పేరు కింద భూదాన్‌ లాండ్స్‌ అని కూడా అడంగల్‌లో పేర్కొన్నారు. ఈ భూములపై సర్వాధికారాలు భూదాన్‌ బోర్డుకు ఉంటాయి. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా ఉన్న భూదాన్‌ బోర్డు... ఇప్పుడు కాస్తా హైదరాబాద్‌ కేంద్రంగానే ఉండటంతో కీలకంగా వ్యవహరించలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే పరదేశిపాలెంలోని 50.56 ఎకరాల భూమి తమదేనంటూ కొద్ది మంది పట్టాలను చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ పట్టాలు కలిగిన యజమానులతో ముఖ్యనేత మంతనాలు జరుపుతున్నారు. అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగినా మీకు పనికాదని.. అంతా తాను పనిచేసుకుంటానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎకరా రూ.10 కోట్ల మేర విలువ ఉంది. అంటే మొత్తం 50.56 ఎకరాల విలువ రూ.500 కోట్లపైమాటే. కోట్ల విలువైన భూమిని తన పరం చేసుకునేందుకు అధికార పార్టీ నేత గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

భూ బకాసరులు మళ్లీ చెలరేగిపోతున్నారు. కోట్ల విలువైన భూముల వివరాలను సేకరిస్తూ కబ్జా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏకంగా రూ.500 కోట్ల విలువచేసే భూదాన్‌ భూములపై ఇప్పుడు కూటమి నేతల కన్ను పడింది. పరదేశిపాలెంలోని సర్వే నంబరు 132లోని మొత్తం 50.56 ఎకరాల భూదాన్‌ భూములను తమపరం చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ సర్వే నంబరులో తమకు భూములు ఉన్నాయంటూ పట్టాలు పట్టుకుని తిరుగుతున్న వారితో మంతనాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ భూముల వ్యవహారాలను తాము చూసుకుంటామని.. మొత్తం పని అయిపోయిన తర్వాత ఎంతో కొంత మొత్తం ముట్టచెబుతామని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భూదాన్‌ భూముల్లో తమకు పట్టా ఉందంటూ ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ పేరుతో 3 ఎకరాల స్థలాన్ని చదును చేసే కార్యక్రమాన్ని అధికార పార్టీ నేతలు కొందరు చేశారు. ఇక్కడ ఉన్న చిన్నపాటి గెడ్డను పూడ్చివేయడంతో పాటు ఉన్న కంపచెట్లను మొత్తం తొలగించారు. ఈ భూమి విలువ రూ.30 కోట్లు విలువ ఉంటుందని అంచనా. ఇక్కడితో ప్రారంభించి.. మొత్తం 50.56 ఎకరాల భూమిని తమ పరం చేసుకునేందుకు ముఖ్యనేత అనుచరులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇది భూదాన్‌ భూమి అని.. ఇక్కడ ఎవరికీ పట్టాలు లేవని గతంలో జిల్లా కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయినప్పటికీ ఇతర మార్గాల ద్వారా ఈ భూమిని కాజేసేందుకు ముఖ్యనేత కాస్తా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

పట్టాలున్నాయంటూ..!

ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ పేరుతో..

రూ.500 కోట్ల భూమి!

రూ.500 కోట్ల భూమి!

గెడ్డను పూడ్చి, కంపచెట్లు కొట్టి మూడు ఎకరాల చదును

మొత్తం 50.56 ఎకరాల భూములపై ముఖ్యనేత గురి రంగంలోకి ముఖ్యనేత అనుచరులు ఈ భూములను తాము డీల్‌ చేస్తున్నామని సంకేతాలు పట్టాలున్న వారితో బేరసారాలు రూ.500 కోట్ల విలువైన భూములపై మంత్రాంగం

వాస్తవానికి ఈ భూముల్లో తమకు పట్టాలున్నాయంటూ పలువురు కోర్టులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు ఉన్న పట్టాలను ఆధారాలుగా చూపుతూ.. కొందరైతే ఏకంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) దృష్టికి కూడా తీసుకెళ్లి.. తమ సంగతి తేల్చాలంటూ విన్నవించుకున్నారు. అన్ని పరిశీలించిన కలెక్టర్లు ఈ భూములన్నీ భూదాన్‌ బోర్డువేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ భూములను ఇల్లు లేని పేదలకు ఇచ్చేందుకు ఉపయోగించుకోవచ్చని కూడా ఆదేశాలు ఇచ్చారు. భూదాన్‌ బోర్డుకు ఇవ్వకముందే తమకు భూములు ఇస్తూ పట్టాలు ఇచ్చారని పలువురు భూయజమానులు ఇప్పటికీ ఇంకా కోర్డుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యనేత రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ భూముల వ్యవహారాన్ని తమకు వదిలేయాలని.. తాము డీల్‌ చేసుకుంటామని చెప్పి నట్టు తెలుస్తోంది. మొత్తం వ్యవహారం ముగిసిన తర్వాత మీకు ఎంతో కొంత ముట్టచెబుతామని స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా పట్టాలు ఉన్న వారిని ముఖ్యనేత అనుచరులు కలిసి తమకు అప్పగించాలని ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది.

మొత్తం భూదాన్‌ భూములపై కన్నేసిన అధికార పార్టీ నేతలు తాజాగా 3 ఎకరాల స్థలాన్ని చదును చేసే ప్రయత్నం చేశారు. మధురవాడ నుంచి ఆనందపురం వెళ్లే ప్రధాన రహదారిలో బోరవానిపాలెం సర్వీసు రోడ్డులో... ఓజోన్‌ వ్యాలీ భూములను సమీపంలో ఉన్న ఈ భూములపై కన్నేసిన నేతలు చదును చేసే ప్రక్రియను ప్రారంభించారు. మొదటి విడతలో ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ పేరుతో 3 ఎకరాల పట్టా ఉందంటూ చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ భూమిలో ఉండే చిన్న గెడ్డను కూడా పూడ్చే ప్రయత్నం చేశారు.

ఈ 3 ఎకరాల స్థలంలో ఉన్న తుప్పలను కూడా కొట్టేసి.. ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎకరా విలువ రూ.10 కోట్ల మేర ఉంటుంది. అంటే మొదటి విడతలో రూ.30 కోట్ల విలువైన భూమితో ప్రారంభించి.. మొత్తం 50 ఎకరాలకు ఎసరుపెట్టే ప్రణాళికలు పక్కాగా సిద్ధమయ్యాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈ భూములకు ముందు 100 అడుగుల రోడ్డు ఉంది. ఇక్కడి నుంచి నేరుగా హైవేకి దారి ఉంది. అంతేకాకుండా పక్కనే వుడా లే–అవుట్‌ కూడా గతంలో వేసి విక్రయాలు జరిపారు.

భూదాన్‌ భూములపై 1
1/2

భూదాన్‌ భూములపై

భూదాన్‌ భూములపై 2
2/2

భూదాన్‌ భూములపై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement