15న స్థాయీ సంఘ సమావేశం

- - Sakshi

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నారు. స్థాయీ సంఘ చైర్‌పర్సన్‌ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన ఉదయం 11 గంటల నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల స్థాయీ సంఘ సమావేశంలో నిర్వహించనున్న సమావేశానికి 23 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి.

● బీచ్‌రోడ్డులో ఆర్కే బీచ్‌ నుంచి పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ వరకు ప్రస్తుతం ఉన్న విగ్రహాలు, విగ్రహ పీఠాలకు ఫోకస్‌ లైట్లు ఏర్పాటు

● జీవీఎంసీ 92వ వార్డు అజంతా పార్క్‌ ఏరియాలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం

● 88వ వార్డు యాదవ జగ్గరాజుపేటలో కల్యాణ మండపం నిర్మాణం

● జోన్‌–7 పరిధి 82వ వార్డులో ఎన్టీఆర్‌ స్టేడియంలో పవర్‌ లిఫ్టింగ్‌ జిమ్‌ నిర్మాణానికి పరిపాలనా పరమైన ఆమోదానికి, టెండర్లు పిలిచేందుకు..

● వేపగుంటలో గల శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రికి 30 కేఎల్‌డీ శుద్ధి చేయబడిన నీటిని సరఫరాకు గాను పైపులైన్‌ వేసేందుకు..

● బీచ్‌రోడ్డు ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ మూడేళ్ల కాలానికి మెయింట్‌నెన్స్‌ చేసేందుకు పిలిచిన రిక్వెస్ట్‌ ఫర్‌ పర్సనల్‌ ఆర్థిక ప్రతిపాదన

● గాజువాక జోన్‌ 73వ వార్డు సింహగిరి కాలనీ వద్ద సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్లు, కల్వర్టుల ఏర్పాటు

● అనకాపల్లి జోన్‌ ప్రధాన రహదారి ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జంక్షన్‌ విస్తరణ.

● గాజువాక జోన్‌ 64 నుంచి 79 వార్డులు, 85 నుంచి 88 వార్డుల్లో రాత్రి వేళల్లో ప్రధాన రహదారుల పారిశుధ్య నిర్వహణకు మూడు నెలల కాలానికి అదనపు సిబ్బంది నియామకం.

● 47వ వార్డు కప్పరాడలో సెయింట్‌ మదర్‌ థెరిస్సా విగ్రహానికి మరమ్మతులు చేపట్టేందుకు..

● జోన్‌–2 పరిధి 12, 13 వార్డుల్లో సూర్య తేజ నగర్‌ బ్రిడ్జి నుంచి శ్రీకాంత్‌ నగర్‌ కల్వర్టు వరకు ఎంఎస్‌ చైన్‌ లింక్డ్‌ మెతో ఫెన్సింగ్‌ ఏర్పాటు

● బీచ్‌రోడ్డు 8వ వార్డు సాగర్‌నగర్‌ బీచ్‌రోడ్డులో గల కాళీమాత గుడికి ఆనుకొని ఉన్న స్థలం అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టేందుకు తదితర అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top