
డాబాగార్డెన్స్: జీవీఎంసీ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడనుందని జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్ వేణుగోపాల్ శుక్రవారం పేర్కొన్నారు. జీవీఎంసీ టీఎస్సార్ ప్రాంగణంలో గల స్టోరేజ్ రిజర్వాయర్ శుభ్రపరుస్తున్న నేపథ్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందన్నారు. జోన్–4 పరిధి 28 నుంచి 39 వార్డుల్లో వెలంపేట, టౌన్ కొత్తరోడ్డు, మెయిన్ రోడ్డు, రంగిరీజువీధి డౌన్, మంతావారి వీధి, సున్నపు వీధి, రెల్లివీధి, జబ్బర్‌తోట, చిలకపేట, అల్లిపురం ప్రధాన రహదారి, నేరెళ్ల కోనేరు రోడ్డు, అమ్మవారి వీధి, కుమ్మరవీధి, కొబ్బరితోట, నేతాజీనగర్, అంబేడ్కర్ కాలనీ, జెండా చెట్టు డౌన్, కలెక్టర్ ఆఫీస్ రోడ్డు, దండుబజార్, జాలారిపేట, సాలిపేట, కేజీహెచ్, డాబాగార్డెన్స్ ప్రధాన రహదారి, జగదాంబ జంక్షన్ రోడ్డు, నీలమ్మ వేపచెట్టు పరిధి, పలు ప్రాంతాలకు ఇది వర్తిస్తుందన్నారు. అత్యవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్టు పర్యవేక్షక ఇంజినీర్ తెలిపారు.