
ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులతో మేయర్ హరివెంకట కుమారి, అధికారులు
డాబాగార్డెన్స్: విధి నిర్వహణలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కారుణ్య నియామక పత్రాలు శుక్రవారం అందుకున్న అభ్యర్థులకు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి సూచించారు. విధుల్లో ఉంటూ మరణించిన 13 మంది ఉద్యోగుల పిల్లలకు ఆమె కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అంకితభావంతో పనిచేయాలని, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా అధికారుల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కట్టమూరి సతీష్, జీవీఎంసీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ డాక్టర్ వై శ్రీనివాసరావు పాల్గొన్నారు.