
పచ్చని మొక్కలు.. పొగమంచుతో ఆహ్లాదకరంగా బీచ్‌రోడ్డు
డాబాగార్డెన్స్: నగరంలో చిత్రమైన దృశ్యం ఆవిష్కృతమైంది. కొన్ని రోజులుగా ఎండలు మండుతున్న వేళ.. శుక్రవారం ఉదయం మంచు కురిసి ఆహ్లాదం పంచింది. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు బీచ్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం నుంచి అటూ.. ఇటుగా పొగమంచు కమ్మేసింది. దీంతో ఎదురెదురు వాహనాలు కనిపించలేదు. బీచ్‌రోడ్డులో వాకింగ్ చేసే వాకర్స్ ఈ వాతావరణాన్ని ఆస్వాదించారు. పచ్చని మొక్కలు.. నిండు పొగమంచుతో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం కనువిందుగా కనిపించింది. బీచ్ అందాలు ద్విగుణీకృతమయ్యాయి.