వీఓఏల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

వీఓఏల పోరుబాట

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

ఈనెల 18 నుంచి నిరవధిక సమ్మెకు

డిమాండ్లు నెరవేర్చేవరకు నిరసన

ఉద్యోగ భద్రత కల్పించాలి

ప్రభుత్వం అందించే రూ.5వేల వేతనం కూడా సక్రమంగా చెల్లించడంలేదు. దీంతో కుటుంబపోషణ భారంగా ఉంది. సమాన పనికి సమాన వేతనం నిబంధన అమలు చేయాలి. కనీస వేతనం రూ.20వేలు చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన చేపడతాం.

– గోపాల్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు, వీఓఏల సంఘం

దౌల్తాబాద్‌: మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తున్న వీఓఏలు (గ్రామ సంఘ సహాయకులు) పోరుబాటకు సిద్ధమవుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబపోషణ భారంగా మారుతుందని సెర్ఫ్‌ ఉద్యోగులకు దీటుగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం కేవలం రూ.5వేల వేతనం మాత్రమే చెల్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా సంఘాల బలోపేతంలో కీలకం

జిల్లా వ్యాప్తంగా 666 మంది వీవోఏలు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల (ఎన్‌హెచ్‌జీ) బలోపేతంతో పాటు పేదరిక నిర్మూలనలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం అందించే రూ.5 వేల వేతనానికి తోడుగా గ్రామ మహిళా సంఘాలు లాభాల్లో ఉంటే అందులో నుంచి మరో మూడు వేల వేతనం తీసుకునే వెసులుబాటు ఉంది. గ్రామసంఘాల పరిపాలన, ఆర్థిక లావాదేవీలు, రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించడంతో పాటు పొదుపు సంఘాల్లోని మహిళలను సంఘటితం చేయడం, వారి సమస్యలను పరిష్కరించడం వీరి ప్రధాన విధి. గ్రామసంఘం, మహిళా సంఘాల ఆర్థికపరమైన అంశాలు, పొదుపు, రుణాల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు ప్రభుత్వ పథథకాలపై సభ్యులకు అవగహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూస్తారు. బ్యాంకు రుణాలను అందించి తిరిగి వాటిని సక్రమంగా చెల్లించేలా చూడడం వంటి విధులు నిర్వహిస్తారు.

ప్రధాన డిమాండ్లు

● వీఓఏలకు రూ.20వేల కనీస వేతనం

● సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్‌సీ పాలసీ, ఉద్యోగ భద్రత

● అర్హులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతి

● వీవోఏలకు సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం రూ.20లక్షలు వరకు కల్పించాలి

కార్యాచరణ

Advertisement
 
Advertisement
Advertisement