చెరవులు | - | Sakshi
Sakshi News home page

చెరవులు

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

చర్యలు శూన్యం

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో వస్తున్న ఊహించని వృద్ధి కారణంగా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో అక్రమార్కుల కన్ను చెరువులు, కుంటలపై పడింది. శిఖం భూములు ఆక్రమిస్తూ అక్రమార్జనకు తెగబడుతున్నారు.

వికారాబాద్‌: ఫొటోలో కనిపిస్తున్నది మోమిన్‌పేట మండల పరిధిలోని ఎన్కతల శివారులో ఉన్న చిన్న చెరువు.. సర్వే నెంబర్‌ 164లో 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు నిర్మించారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ చెరువు పరిసరాల్లో భూమి కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో అతని కన్ను చెరువు స్థలంపై పడింది. చెరువుకు ఉన్న వంద మీటర్ల బఫర్‌ జోన్‌లో గతంలో ఓ వైపు నిర్మాణాలు చేపట్టగా తాజాగా టిప్పర్లతో మట్టిని తీసుకువచ్చి చెరువు పూడ్చివేతకు పూనుకున్నాడు. ఎఫ్‌టీఎల్‌ ఏరియాలోనూ ఎకరా స్థలం ఆక్రమించి పొలం చేశాడు. రికార్డులలో 20 మీటర్ల వెడెల్పుతో అలుగు ఉండగా గతంలో కబ్జా చేసి రాతి గోడ నిర్మించడంతో నాలుగు మీటర్లకు కుదించుకుపోయింది. ఇక ఈ చెరువులోకి నీరు చేరేందుకు ప్రధాన ఆధారమైన ఫీడర్‌ చానెల్‌ను కబ్జా చేసి పూడ్చేశాడు. పొలానికి ఆనుకుని ఉన్న నక్ష బాటను సైతం కబ్జాకు గురైంది. దీంతో అటు వైపున్న పొలాల రైతుల రాకపోకలకు వీలు లేకుండా పోయింది. స్థానిక అధికారులు సైతం కబ్జా దారులకే కొమ్ముకాయడంతో గతేడాది కలెక్టర్‌ను కలిశారు. వెంటనే స్పందించిన ఆయన కబ్జా నిగ్గు తేల్చాలని తహసీల్దార్‌, ఇరిగేషన్‌ ఈఈలను ఆదేశించారు. వెంటనే సర్వే చేపట్టిన వారు కబ్జా నిజమేనని, చెరువును మట్టితో పూడ్చేసి మరీ కబ్జాకు పాల్పడడ్డారని తేల్చారు. కబ్జా చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ అధికారులు మోమిన్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కాగా అధికారులు కబ్జా నిజమేనని తేల్చి ట్రెంచ్‌ కొట్టి వదిలేశారు తప్ప చెరువును కబ్జా చెర నుండి విడిపించలేదు. ఇప్పుడు చెరువుకు ఆవలి వైపు మట్టితో పూడ్చేసి చదును చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవంలేదని చుట్టు పక్కల రైతులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మీకెందుకని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.

రికార్డులు తారుమారు

జిల్లా వ్యాప్తంగా 1,196 చెరువులుండగా విడతల వారీగా గత ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పనులు చేపట్టారు. ఈ పథకంలో భాగంగా ఎక్కడైనా చెరువులు కబ్జాకు గురైతే రెవెన్యూ అధికారుల సమన్వయంతో వాటికి హద్దులు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. కానీ పనులు చేపట్టిన నీటి పారుదల శాఖ అధికారులు ఎక్కడా కబ్జాల జోలికి వెళ్లలేదు. హద్దులు ఏర్పాటు చేయలేదు. నానాటికి కబ్జాల విస్తీర్ణం పెరుగుతూ.. కుంటలు, చెరువులు కుంచించికు పోతున్నాయి. పలుచోట్ల చెరువులు, కుంటలు, దారులు, పానాదులు, నాలాలకు సంబంధించి రికార్డులు సైతం తరుమారయ్యాయి. నీటిపారుదల శాఖ దగ్గర సైతం చెరువులకు సంబంధించిన రికార్డులు కనిపించటంలేదు. కొన్ని చెరువులు భౌతికంగా కనిపిస్తున్నా రికార్డుల్లో ఉండడం లేదు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ముగాస్తున్నారనే ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కబ్జాలపై ఆరోపనలు వచ్చినా.. పేపర్లలో వార్తలు ప్రచురించినా.. అక్రమార్కులతో కుమ్మకై ్క వారికి వంత పాడుతున్నారు. అంతా తాము చూసుకుంటాం అంటూ విచారణ పేరుతో వారికి అనుకూలంగా ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తున్నారు. దీంతో కబ్జా రాయుళ్లకు అడ్డూ అదుపులేకుండా పోతుంది.

భూ కబ్జా రాయుళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇటీవల కబ్జా చేసిన భూములను సైతం విక్రయిస్తున్నారు. కబ్జాలు అక్కడక్కడ అధికారుల దృష్టికి వచ్చినా.. ఎవరైనా ఫిర్యాదులు చేసినా.. తాత్కాలికంగా విచారణ పేరుతో సందర్శిస్తున్నారే తప్ప.. ఏ ఒక్క చోట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంలో తహసీల్దార్‌, ఇరిగేషన్‌ అధికారులు మొదలుకుని అడిషనల్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ వరకు ఫిర్యాదులు అందినా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తీసుకున్న చర్యలు సైతం తూతూ మంత్రంగానే ఉంటున్నాయి తప్ప చెరువుల చెర విడిపించేదాక వెళ్లటంలేదు.

శిఖం భూములను పొలాల్లో కలిపేసుకుంటున్న వైనం

నాలాలు, వాగులను సైతం వదలని కబ్జారాయుళ్లు

ఫిర్యాదులు అందినా పట్టించుకోని అధికారులు

కబ్జాలు నిజమైనా చర్యలు శూన్యం

అక్రమార్కులకే అధికారగణం అండదండలు

Advertisement
 
Advertisement
Advertisement