దత్తత చట్టంలోని మార్పులు తెలుసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దత్తత చట్టంలోని మార్పులు తెలుసుకోవాలి

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

దత్తత చట్టంలోని మార్పులు తెలుసుకోవాలి

న్యాయమూర్తి రాధిక

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణంలోని శిశుగృహను శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి రాధిక సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడున్న శిశువుల ఆరోగ్యం, వారికి అందించే ఆహారం తదితర విషయాలపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. శిశువుల దత్తతకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దత్తత చట్టంలోని మార్పులను గురించి కొత్తగా చేర్చిన అంశాలను గురించి వివరించారు. ఆమె వెంట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదులు వెంకటేశ్‌, రాము, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement