అనంతగిరి: స్వీయ గణనలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ జనాభా లెక్కలు–2027 కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 2026 ఏప్రిల్ 26 నుంచి స్వీయ గణన అధికారికంగా ప్రారంభమైందన్నారు. మే 10 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. దేశ అభివృద్ధిలో జనాభా లెక్కలకు అత్యధిక ప్రాముఖ్యత ఉంటుందన్నారు. నేను పాల్గొన్నాను, ప్రజలంతా ఈ ప్రక్రియలో పాల్గొనాలన్నారు. ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా సీపీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ విక్రంసింహా రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


