ఎదురెదురుగా కారు, బొలేరో ఢీ | - | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా కారు, బొలేరో ఢీ

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

ఎదురెదురుగా కారు, బొలేరో ఢీ

పరిగి: బొలేరో, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పరిగి ఠాణా పరిధిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో పరిగి మండలం రంగాపూర్‌ శివారులోకి రాగానే హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారులో ఉన్న నవనీత ఆమె కుతురు శ్రీనిజ్ఞాకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లీకూతురుకు గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement