మద్దతు ధరతో లాభాలు పొందాలి | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధరతో లాభాలు పొందాలి

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

మద్దతు ధరతో లాభాలు పొందాలి

అనంతగిరి: వికారాబాద్‌లో మార్క్‌ఫెడ్‌, డీసీయంఎస్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌ యార్డులో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ దీపక్‌ తివారీ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ఽమద్దతు ధరకు విక్రయించుకుని లాభాలు పొందాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ముదిరాజ్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం రేఖ, డీసీఎంఎస్‌ మేనేజర్‌ సుదర్శన్‌రెడ్డి, ఏయంసీ సెక్రటరీ వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దీపక్‌ తివారీ

Advertisement
 
Advertisement
Advertisement