దౌల్తాబాద్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కొడంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్యగౌడ్ కోరారు. శనివారం ఆయన మండలంలోని గోకఫసల్‌వాద్, దేవర్‌ఫసల్‌వాద్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సేవ్యానాయక్, నర్సింలు, కొటం రాములు, సర్పంచ్‌లు మల్లమ్మ, కూర రాజు, పీఏసీఎస్ సిబ్బంది మల్లికార్జున్, వెంకటేశ్, ఇస్మాయిల్ తదితరులున్నారు.
కొడంగల్ ఏఎంసీ చైర్మన్ అంబయ్యగౌడ్


