దుద్యాల్: మారుతున్న కాలనుగునంగా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అందుకు అనుగునంగా విద్యార్థులు పరీక్షల్లో సులువుగా మార్కులు సాధించేందుకు ‘సాక్షి’దినపత్రిక స్టడీ మెటీరియల్ సిద్ధం చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించింది. పాఠశాలలో ఉపాధ్యాయుడు భోదించిన పాఠాలకు ఉచిత స్టడీ మెటీరియల్‌తో మంచి మార్కులు సాధించామని విద్యార్థులు చెబుతున్నారు. సులువుగా మార్కులు సాధించేందుకు ప్రతీ పాఠ్యాంశానికి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులను తయారు చేసింది. అలా తయారు చేసిన మెటీరియల్‌లను మండలంలోని అన్ని జెడ్పీహెచ్‌ఎస్‌లకు, కేజీబీవీలకు, గురుకులాలకు అందించారు.
స్టడీ మెటీరియల్‌తో
మెరిట్ సాధించామంటున్న విద్యార్థులు


