నవాబుపేట: ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి అన్నారు. శనివారం మండల కేంద్రంలో 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా బాల పంచాయతీ, మాదకద్రవ్యాలపై అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలన్నారు. పెద్దలను చూసే పిల్లలు నేర్చుకుంటారని చెప్పారు. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలన్నారు. డ్రగ్స్‌కు బానిసైన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి పునరావాస కేంద్రాల్లో ఉంచుతున్నామన్నారు. గ్రామ స్థాయిలో పిల్లల సంరక్షణ భాద్యతతోపాటు బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతీ ఆరు నెలలకు గ్రామ సభలు నిర్వహించి పిల్లల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సర్పంచులు, కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్‌రెహమాన్, సీఐలు అన్వర్‌పాషా, రాఘవేణి, భరోసా ఎస్‌ఐలు శ్వేత, స్రవంతి, ఎంపీఓ విజయ్‌కుమార్ బాలల సంరక్షణ అధికారులు అంజనేయులు, రాజునాయక్, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు, కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, బాలబాలికలు తదితరులున్నారు.
జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి


