మహేశ్వరం: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర అర్బన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో శనివారం నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుతు సత్యనారాయణ, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఎల్‌పీఓ సాంభిరెడ్డి, జీహెచ్‌ఎంసీ బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, జల్‌పల్లి డిప్యూటీ కమిషనర్ వెంకట్రాం, మహేశ్వరం మండల ప్రత్యేకాధికారి సుభాషిణి, మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్ తహసీల్దార్‌లు చిన్న అప్పల నాయుడు, గోపాల్, ఇందిరా దేవి, మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహరెడ్డి


