అనంతగిరి: నవాబ్‌పేట మండల కేంద్రంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద చేసిన దాడుల్లో ముగ్గురు వ్యక్తుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. శుక్రవారం ఉన్నతాధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం, వారిచ్చిన ఆదేశాల మేరకు ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద దాడులు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తుల నుంచి 330 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వికారాబాద్ ఎకై ్సజ్ సీఐకి అప్పగించామన్నారు. ఈ దాడుల్లో ఏఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది యాదగిరి, యూసుఫ్, నరేశ్‌గౌడ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ముగ్గురు అరెస్ట్


