కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

కుల్కచర్ల: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బీఎస్‌ ఆంజనేయులు ముదిరాజ్‌ అన్నారు. శుక్రవారం ఆయన సర్పంచ్‌ అంజిలయ్యతో కలిసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. సన్నరకం వడ్లకు రూ.500 బోనస్‌ను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌–బి అధ్యక్షుడు కర్రె భరత్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, పీరంపల్లి సర్పంచ్‌ వెంకటయ్య, ఏపీఎం శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం

అనంతరం మండల కేంద్రంలో అనూషశాంతకుమార్‌ దంపతులు నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి గోపాల్‌ నాయక్‌, మాజీ అధ్యక్షుడు వెంకటయ్య, మాజీ సర్పంచ్‌ వెంకటయ్య, రజక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి వెంకటేశ్‌, గ్రామస్తులు రాజు, నర్సింలు, భాను, తదితరులు పాల్గొన్నారు.

డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement