షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఇల్లు దగ్ధం

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

అనంతగిరి: షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అర్ధరాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన వికారాబాద్‌ మండలం అత్త్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి 2 గంటలకు చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన డప్పు ఎల్లయ్య భార్య, కుమారుడితో కలిసి నిద్రిస్తున్నాడు. ఈక్రమంలో మంటలు రావడం గమనించిన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. స్థానికులు మంటాలార్పేందుకు విఫలయత్నం చేశారు. ఫైరింజన్‌ వచ్చి మంటలను అదుపులోకి వచ్చాయి. అప్పటికే ఇంట్లోని సామగ్రి కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో రూ.20 వేల నగదు, ఐదు గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు, బియ్యం, నిత్యవసరాలు, టీవీ, వంట సామాగ్రితో పాటు ఇల్లంతా దగ్ధమయింది. దాదాపు రూ.7 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. సర్పంచ్‌ విజయక్ష్మిమహేందర్‌రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించి రైతుకు ధైర్యం చెప్పారు. ఈ విషయం అధికారులు, స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.

రూ.7 లక్షల ఆస్తి నష్టం

Advertisement
 
Advertisement
Advertisement