కల్లు తాగొద్దన్నందుకు.. | - | Sakshi
Sakshi News home page

కల్లు తాగొద్దన్నందుకు..

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

కల్లు తాగొద్దన్నందుకు.. ఆర్‌ఎంపీ వైద్యుడు అదృశ్యం

ఉరివేసుకొని బలవన్మరణం

శంకర్‌పల్లి: కల్లుకు బానిసైనా ఓ వ్యక్తి.. దాన్ని తాగొద్దన్నందుకు మనస్తాపంతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మోకిల పోలీస్‌ స్టేషన్‌ పరిఽధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌ రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని గోపులారం గ్రామానికి చెందిన శ్రీశైలం (46) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏళ్ల నుంచి కల్లు తాగే అలవాటు ఉండగా ఆరోగ్యం పాడవుతుందని మానేయాలని కుటుంబసభ్యులు చెబుతూ వచ్చారు. దీంతో మూడు రోజుల నుంచి కల్లు మానేసిన ఆయన అప్పటి నుంచి ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కేశంపేట: ఆర్‌ఎంపీ వైద్యుడు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట గ్రామానికి చెందిన భూయాకర్‌ రవీందర్‌ గ్రామంలోనే ఆర్‌ఎంపీ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. కుటుంబంతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నారు. గతనెల 24న ఇంట్లో పెద్ద కుమారుడితో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన రవీందర్‌ మరుసటి రోజున ఇంట్లో నుంచి క్లినిక్‌కు వెళ్లి అక్కడి నుంచి ఆమనగల్లు వైపు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. బంధువులు, తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం భార్య శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement