స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులకు రాజేంద్రనగర్‌ జోన్‌ జోనల్‌కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. గురువారం రాజేంద్రనగర్‌లోని జోనల్‌ కార్యాలయంలో యూసీడీ అధికారులతో కలిసి ఆయన సమావేశమయ్యారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచి మరిన్ని ఎస్‌హెచ్‌జీ గ్రూపులను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ‘‘99 డేస్‌ ఆఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌’కార్యక్రమం కింద ఇప్పటి వరకు జోనల్‌లో మొత్తం 198 గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు జోనల్‌ కమిషనర్‌కు వివరించారు. ఈ సంఖ్యను మరింత పెంచడానికి వార్డు స్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఎస్‌హెచ్‌జీలు కీలకంగా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్హత గల కుటుంబాన్ని భాగస్వామ్యం చేయాలని కమిషన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement