ధారూరు: చమురు కొరతను బూచీగా చూపుతూ.. పెట్రోల్ బంకుల నిర్వాహకులు తమ చేతివాటం చూపుతున్నారు. దాచిదాచి రూ.200లకు లీటరు ఇందనం విక్రయిస్తూ దోచుకుంటున్నారని వాహనదారులు ఆరోపించారు. కృత్రిక కొరత సృష్టిస్తూ.. బ్లాక్ దందాకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందన కొరత లేదని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా.. మండల పరిధి బంకుల్లో వారం రోజులుగా నోస్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ జిల్లా సివిల్ సప్‌లై అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. గురువారం ధారూరు మండల కేంద్రంలోని ఫిల్లింగ్ స్టేషన్‌కు డీజిల్, పెట్రోల్ రావటంతో వాహనదారులు క్యూకట్టారు. ఇక్కడ ఒక్కరికి 2 లీటర్లే పోస్తామని నిర్వాహకులు స్పష్టం చేయగా.. అంతకే సరిపెట్టుకుంటున్నారు.


