ధర్మ రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

ధర్మ రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

చేవెళ్ల: హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యతని వేదాంత గీత ఫౌండేషన్‌(నంద్యాల) సభ్యుడు అభినవ శంకరానందస్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌ క్షేత్ర సేవా ప్రముఖ్‌ ఎక్క చంద్రశేఖర్‌, మహిళా వక్త సరస్వతీ శిశు మందిర్‌ సంభాగ్‌ సమితి సభ్యురాలు శారదా దయానిధి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం పక్కనే బుధవారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సమాజా నిర్మాణంలో హిందూ సమాజం, మహిళల పాత్ర, కుటుంబ విలువలపై ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఆధునిక కాలంలో పాశ్యాత్య ప్రభావాల నడుమ మన సంప్రదాయలను మరిచిపోతున్నారని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమ్మేళనంలో భక్తిగీతాలు, ధార్మిక నినాదాలు కార్యక్రమానికి మరింత ఉత్సవం నింపాయి. స్థానిక భక్తులు, యువకులు, మహిళలు, సామాజిక కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement