కలెక్టర్ దీపక్ తివారీ
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్
అనంతగిరి: అంగన్‌వాడీ టీచర్లకు బీఎల్‌ఓ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం వికారాబాద్‌లో అంగన్‌వాడీ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ఽఅంగన్‌వాడీ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, 4జీ సెల్‌ఫోన్‌లు వాపస్ తీసుకుని 5జీ మొబైల్స్ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని, అర్హులకు ప్రమోషన్‌లు ఇవ్వాలని మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మి, సుజాత, మానస, అన్నపూర్ణ, చంద్రకళ, లక్ష్మి, భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
హుడాకాంప్లెక్స్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 11వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 162 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్టు తెలిపారు. ఐటీ, హెల్త్ కేర్, ఇండస్ట్రియల్, ఫార్మా, రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, సేవా రంగం తదితర అనేక విభాగాలకు చెందిన సంస్థలు పాల్గొంటాయని చెప్పారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ వంటి అర్హతలతో ఉన్న అభ్యర్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంపిక చేసుకుని, అదే రోజున ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. https://satg. `telangana.gov.in/prajapalana/ వెబ్ లింక్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తమ బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాల్సిందిగా కోరారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ సుధాకర్ బండారి ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థిపై ఆయన 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఓటింగ్ నిర్వహించారు. డాక్టర్ అనురాగిణిరెడ్డి, డాక్టర్ వినోద్, డాక్టర్ వినయ్, డాక్టర్ చంద్రకృష్ణ, డాక్టర్ శ్రీలత, డాక్టర్ రాకేష్, డాక్టర్ శ్రీకర్, డాక్టర్ గాయిత్రీలతో కూడిన వైద్య బృందం ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించింది.
బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వీరయ్య


