● మరో హైదరాబాద్‌గా మారనున్న వికారాబాద్
● శాససనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
ధారూరు: భవిషత్తులో వికారాబాద్ రెండో హైదరాబాద్‌గా అభివృద్ధి చెందనుందని, ఎవరూ కూడా తమ భూములు విక్రయించవద్దని శాససనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం ధారూరు మండలం గురుదోట్ల గ్రామ పంచాయతీ పరిధి వెనకతండా, కుక్కిందలో తొలుత లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటిని, అనంతరం నాగసమందర్‌లో నూతనంగా నిర్మించిన చర్చిని ప్రారంభించి మాట్లాడారు. వికారాబాద్ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి, అభివృద్ధి చేస్తానని చెప్పారు. దీంతో మన ప్రాంతంలో భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పుడు భూములు అమ్ముకుంటే.. ఆ తరువాత చింతించాల్సి వస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాన్‌సింగ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, కుక్కింద, గురుదోట్ల సర్పంచులు మణెమ్మ, రాములు, కాంగ్రెస్ కమిటీ జిల్లా కార్యదర్శి మహ్మద్ బాబాఖాన్, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం
అనంతగిరి: ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. వికారాబాద్ మండలం బురాన్‌పల్లిలో లబ్ధిదారు ఇందిరమ్మ ఇంటిని గురువారం ప్రారంభించారు. లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి మాట్లాడారు. పేదవారి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. అర్హులు ఎవరూ ఆందోళన చెందవద్దని, విడతల వారీగా అందరికీ ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ రాందాస్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశం, ఎంపీడీఓ వినయ్‌కుమార్, ఎంపీఓ దయానంద్, సీనియర్ నాయకుడు మనోహర్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి స్వాతి, ఉప సర్పంచ్ మంజుల, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


