ప్రమాణం చేయక ముందే హామీ నిలబెట్టుకుని
కేశంపేట: ఎన్నికల సమయంలో నాయకులు హా మీలు ఇస్తుంటారు.. మర్చి పోతుంటారు.. కానీ ఆ గ్రామంలో వార్డు సభ్యురాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రమాణ స్వీకారం చేయక ముందే నిలబెట్టుకున్నారు. మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలోని 4వ వార్డు సభ్యురాలిగా పసుల స్వప్న ఎన్నికల బరిలో నిలిచారు. ప్రచారం నిర్వహిస్తుండగా నీటి సమస్యను కాలనీవాసుల ద్వారా తెలుసుకొని నూతనంగా బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం వార్డులో బోరు వేయించారు. త్వరలోనే మోటారును ఏర్పాటు చేసి కాలనీలో నీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు మల్లేశ్‌యాదవ్, మాజీ సర్పంచ్ నవీన్‌కుమార్, ఉప సర్పంచ్ దర్శన్, మాజీ మండల కో–ఆప్షన్ సభ్యులు జమాల్‌ఖాన్, నరేష్‌యాదవ్, కుంటి లక్ష్మయ్య, జగన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కృష్ణయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


