న్యూఇయర్ వేడుకల్లో మద్యం వినియోగానికి అనుమతి తప్పనిసరి
శంషాబాద్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్
రాజేంద్రనగర్: నూతన సంవత్సరం ప్రారంభ వేడుకల్లో మద్యాన్ని వినియోగించాలనుకుంటే తప్పనిసరిగా ఎకై ్సజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని శంషాబాద్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్ సూచించారు. ఈవెంట్లతో పాటు ఫంక్షన్ హాళ్లు, క్లబ్‌లు, ఫామ్‌హౌస్ తదితర ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మద్యం సేవిస్తే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఆదివారం ఉప్పర్‌పల్లిలోని స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గత సంవత్సరం స్టేషన్ పరిధిలో 20 ఈవెంట్లు నిర్వహించారన్నారు. వారందరికీ ఎకై ్సజ్ శాఖ తరఫున మద్యం వినియోగించేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. అనుమతులు తీసుకోకుండా ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్టేషన్‌లో సైతం దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉందన్నారు. వేడుకల్లో విదేశీ మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల మద్యం, డ్యూటీ ఫ్రీ మద్యాన్ని వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని గమనించి ఎకై ్సజ్ శాఖ తరఫున అనుమతులు తీసుకోవాలని కోరారు.


