నేడు క్రిస్మస్ విందు
తహసీల్దార్ తారాసింగ్
తాండూరు రూరల్: నియోజకవర్గంలోని క్రిస్టియన్లకు సోమవారం ప్రభుత్వం తరఫున క్రిస్మస్ విందు ఇవ్వనున్నట్లు తహసీల్దార్ తారాసింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హాజరవుతారన్నారు. క్రిస్టియన్లు విందుకు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.
మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
తాండూరు రూరల్: ఎల్మకన్నె గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. గ్రామంలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్ బ్యాగరి నరేష్ ఆదివారం హైదరాబాద్‌లో మహేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలోని కొత్త సర్పంచ్‌లకు అన్ని విధాలా అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వై రాములు, నాగప్ప, రాజు, నరేష్, చాకలి రాజు, అశోక్ తదితరులు ఉన్నారు.
పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప
పరిగి: రాజీయే రాజమార్గమని పరిగి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగుల శిల్ప అన్నారు. ఆదివారం పట్టణంలోని కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. 58 కేసులను ఇరువురి ఒప్పందంతో పరిష్కరించారు. 108 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించి రూ.1,92,000 జరిమానా విధించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్షణికావేశంలో తప్పులు చేసి జైలుపాలు కావొద్దని సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక అన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. కేసులు ఉన్న వారు ఎప్పుడైనా రాజీ కావచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహబ్
తాండూరు టౌన్: మైనార్టీ ఉపాధ్యాయుల పట్ల విద్యాశాఖ అధికారులు చూపుతున్న వివక్షను వ్యతిరేకిస్తున్నట్లు మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహబ్ అన్నారు. ఆదివారం ఆయన సమితి సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లోని జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న ఖలీల్ పాషాకు రావాల్సిన వేతనం, ఇంక్రిమెంట్లను విద్యాశాఖాధికారులు అకారణంగా నిలిపివేయడం సమంజసం కాదన్నారు. సాహితీవేత్త అవార్డు గ్రహీత అయిన ఆయనపై స్కూల్ హెచ్‌ఎం, ఎంఈఓ కావాలనే పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయానికి పాఠశాల ఎదుట టెంటు వేసుకుని శాంతియుత దీక్ష చేస్తున్నప్పటికీ వారిలో స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. మైనార్టీ ఉపాధ్యాయుని పట్ల అధికారులు చూపుతున్న వివక్షకు నిరశనగా రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోనలు చేస్తామని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. దీనిపై సీఎంతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. వెంటనే ఖలీల్ పాషాకు న్యాయం చేయాలని లేకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు సైతం వెనకాడేది లేదన్నారు. సమావేశంలో సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ వసీమ్, ముస్తఫా, ఎండి సమి, ఎండి సాదిక్, అంజద్ అలీ పాషా, ఫర్హాద్, వాసే, గౌస్, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు క్రిస్మస్ విందు
నేడు క్రిస్మస్ విందు


