యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
షాద్‌నగర్‌రూరల్: ప్రతిరోజు యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు ఆదివారం యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. యోగాతో అనేక దీర్ఘకాలిక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుందని అన్నారు. నిత్యం యోగా సాధనతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్, కేశంపేట సీఐ నరహరి, ఎస్‌ఐలు సుశీల, శ్రీకాంత్, రాంచంద్రయ్య, ప్రణయ్, రాజేశ్వర్, రవీందర్‌నాయక్, విజయ్, పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


