‘ఉపాధి హామీ’ రద్దుకు కేంద్రం కుట్ర | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి హామీ’ రద్దుకు కేంద్రం కుట్ర

Dec 21 2025 12:51 PM | Updated on Dec 21 2025 12:51 PM

‘ఉపాధి హామీ’ రద్దుకు కేంద్రం కుట్ర

‘ఉపాధి హామీ’ రద్దుకు కేంద్రం కుట్ర

● సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్‌

అనంతగిరి: ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్‌ అన్నారు. శనివారం వికారాబాద్‌లోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో ఆయన పార్టీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ఏకమై కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చట్ట పరిరక్షణకు ఊరూరా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కూలీని రూ.307 నుంచి రూ.600 లకు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, సుదర్శన్‌, సతీశ్‌, నవీన్‌కుమార్‌, యాదయ్య, శ్రీనివాస్‌, పవన్‌, కృష్ణ, దావిద్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

పథకం పేరు మార్పు సరికాదు

పరిగి: ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం పేరు మార్పు సరికాదనిసీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడువెంకట య్య అన్నారు. ఇందుకు నిరసనగా శనివారం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణ లో వీబీ రామ్‌జీ బిల్లు ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రజలకు అందించాల్సిన అవసరాలను తప్పించుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. బిల్లు రద్దు చేసేంత వరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య, సత్తయ్య, రఘురాం, మహిపాల్‌, యాదగిరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement