భవిష్యత్తు ఏఐదే
మొయినాబాద్: భవిష్యత్తు మొత్తం కృత్రిమ మేధస్సు (ఏఐ)తోనే కొనసాగుతుందని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ యెజ్ఞ నారాయణ అన్నారు. అజీజ్‌నగర్‌లోని కేఎల్‌హెచ్ క్యాంపస్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన థింక్ ఏఐ– 2025 సదస్సు శనివారం ముగిసింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన నిపుణులు ఏఐ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొన్నేళ్లలో ఏఐ యుగం రాబోతోందని, కొత్త కొత్త ఆవిష్కరణలపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సదస్సులో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, స్పీచ్, సిగ్నల్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై నిపుణులు చర్చించారు. సదస్సులో కేఎల్‌హెచ్ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవీష్, కోయిర్ ఎర్త్ టెక్నాలజీస్ నుంచి డాక్టర్ అమిత్ వర్మ, డెలాయిట్ తరఫున డాక్టర్ సుబ్రజిత్, టీయూ బెర్లిన్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.


