సంప్రదాయాలను కాపాడుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సంస్కృతి, విలువలను, భవిష్యత్‌తరాలకు అందించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రిన్స్‌పల్ మధుకర్ స్వామి, పల్లవి గ్రూపు డైరెక్టర్ నిహారిక, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు


