చెస్‌తో మేధోశక్తి పెంపు
తాండూరు టౌన్: ఈ నెల 15న ప్రారంభమైన చెస్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం అట్టహాసంగా ముగిసాయి. ఆర్బీఓఎల్(రాడికల్ బయో కెమికల్ ఆర్గానిక్స్), ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో అండర్–14, అండర్–16 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అండర్ 14 విభాగంలో క్రిత్విక్ చాంపియన్ షిష్(విశ్వవేద), రన్నర్‌గా రాంచరణ్ (కేవీసీహెచ్), అండర్–16 విభాగంలో విన్నర్‌గా ప్రజ్యోత్ (సెయింట్ మేరీస్), రన్నర్‌గా ఓంకార్ (గౌతమి) నిలిచారు. విజేతలకు ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళారెడ్డి మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధోశక్తి పెంపుదలకు చెస్ పోటీలు ఉపకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య గౌడ్, హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్, ట్రెస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి అభిలాష్ రెడ్డి, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, రవీందర్ రెడ్డి, మోహనకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షురాలు జెసింత, ఓం ప్రకాష్ సోమాని, ఆలంపల్లి శ్రీనివాస్, కొట్రిక నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆర్బీఓఎల్ ఎండీ సరళారెడ్డి


