ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయండి
దోమ: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన సర్పంచ్‌లు పనిచేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో గుండాల నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ ఉపసర్పంచ్ కేశవులు, వార్డు సభ్యులు కుర్వ అంజిలయ్య, బోయిని లక్ష్మి, లక్ష్మిబాయి, రాములు నాయక్, హర్య నాయక్ మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు సర్పంచులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అఽధికారంలో ఉన్నప్పటికి గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర నిధులు తప్పనిసరి వస్తుంటాయని, వాటితో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, సీనియర్ నాయకుడు జగత్‌రెడ్డి, నేతలు, తదితరులు పాల్గొన్నారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి


