కోళ్లపడకల్ ఉప సర్పంచ్‌గా మల్లేశ్
మహేశ్వరం: కోళ్లపడకల్ గ్రామ ఉప సర్పంచ్‌గా ఆవుల మల్లేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికలో ఐదుగురు వార్డు సభ్యులు ఆయన పేరును ప్రతిపాదించి, మద్దతు తెలపడంతో ఎంపీడీఓ శైలజ, రిటర్నింగ్ అధికారి రాంప్రసాద్‌రెడ్డి ఎన్నికను ధ్రువీకరించారు. అనంతరం మల్లేశ్ మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన వార్డు సభ్యులు, గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, మల్లేశ్ గతంలో కూడా ఉప సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గజవాడ నరేష్, కాడిగళ్ల శివరాములు, మోడి గాయత్రి, నాగుల వసంత తదితరులు పాల్గొన్నారు.


