వైభవంగా రేణుక ఎల్లమ్మ జాతర
సిడె ఊరేగింపు, అమ్మవారికి పూజలు చేస్తున్న పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు
యాలాల: మండలంలోని ముద్దాయిపేటలో కొలువుదీరిన రేణుక ఎల్లమ్మ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు సిడె ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మొక్కిన మొక్కులు తీర్చే ఎల్లమ్మగా పేరుగాంచిన ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఎల్లమ్మ జాతరను ఈ సారి కూడా ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూ జలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంతుల రుద్రమణి, ఎంపీటీసీ మాజీ సభ్యులు దేవ గారి రాములు,మాజీ సర్పంచ్‌లు బిచ్చన్నగౌడ్, క్రిష్ణయ్యగౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు భానుప్రసాద్‌గౌడ్ మహేందర్‌రెడ్డిని ఆలయ కమిటీ తరఫున ఘనంగా సన్మానించారు.శనివారం చుక్కాబోనాలు, ఆదివారం రథోత్సవం నిర్వహించనున్నారు.
వైభవంగా రేణుక ఎల్లమ్మ జాతర


