నాణ్యమైన విత్తనాలనే ఎంచుకోవాలి
నవాబుపేట: అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులు ఎంచుకోవాలని హైటెక్ సీడ్ కంపెనీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేనేజర్ భరత్‌రెడ్డి సూచించారు. మండలంలోని గుబ్బడిపత్తేపూర్ గ్రామంలో శుక్రవారం రైతులకు పంటల సాగు, ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనేక సీడ్ కంపెనీలు విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నారన్నారు. అందులో నాణ్యమైన, అధిక దిగుబడులను ఇచ్చే విత్తనాలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. హైటెక్ సీడ్ మొన్నజొన్న 5106, 3206 తెల్ల జొన్న విత్తనాలు అత్యధిక నాణ్యత, అధిక దిగుబడులు సాధించాయన్నారు. వివిధ రకాల పంటల సాగు, ఎరువుల వాడకాన్ని వివరించారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు రాఘవేంద్ర, రాజు, సంతోష్ పాల్గొన్నారు.
నాడు కారోబార్..
నేడు సర్పంచ్
కుల్కచర్ల: ఎన్నికలంటే నే ఎన్నో ఆసక్తికర సంఘటనలకు నిలయం. కుల్కచర్ల మండలంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎర్రగోవింద్ తండా పంచాయతీలో గత సర్పంచ్ హ యాంలో రాజునాయక్ కారోబార్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కారోబార్‌గా పని చేసిన చోటే సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకోవడంతో స్థానికులు అభినందిస్తున్నారు.
నాణ్యమైన విత్తనాలనే ఎంచుకోవాలి


