మైనార్టీ విద్యార్థులకు చేయూత | - | Sakshi
Sakshi News home page

మైనార్టీ విద్యార్థులకు చేయూత

Dec 21 2025 7:00 AM | Updated on Dec 21 2025 7:00 AM

మైనార

మైనార్టీ విద్యార్థులకు చేయూత

మైనార్టీ విద్యార్థులకు చేయూత జుంటుపల్లి రామస్వామి ఆలయ మాజీ చైర్మన్‌ మృతి స్కూటీని ఢీ కొట్టిన కారు జింక పిల్లను ఫారెస్ట్‌ సిబ్బందికి అప్పగింత బాలుడిపై వీధి కుక్క దాడి ఓటేయలేదని చితకబాదారు

జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రాజేశ్వరి

అనంతగిరి: మైనార్టీ విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రాజేశ్వరి శుక్రవారం ఓ ప్రకటనలోతెలిపారు. ముఖ్యమంత్రి ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకంలో విదేశాల్లో ఉన్నతవిద్య చదువుతున్న మైనార్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనవరి 20 వరకు కలెక్టరేట్‌లోని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 79933 57103లో సంప్రదించాలన్నారు.

యాలాల: జుంటుపల్లి రామస్వామి ఆలయ మాజీ చైర్మన్‌ హన్మంత్‌రావు దేశ్‌ముఖ్‌(48) శుక్రవారం మృతి చెందారు. నిత్యం బీపీ ట్యాబెట్లు వేసుకునే ఆయన పది రోజులుగా నిర్లక్ష్యం చేయడంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ పురుషోత్తంరావు, సర్పంచ్‌ శ్రీవాణి రమేశ్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, రాఘవేందర్‌రావు, గ్రామ పెద్దలు పార్థసారథి, రవీందర్‌రావు తదితరులు ఉన్నారు.

మహిళ దుర్మరణం

నందిగామ: స్కూటీని కారు ఢీకొట్టడంతో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని మేకగూడ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కోనకాని సుమిత్ర(30) శుక్రవారం మధ్యహ్నం స్కూటీపై పొలం వద్దకు బయలుదేరింది. కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారు అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి స్కూటీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సుమిత్ర తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు ఉండగా, భర్త ఇటీవలే మృతి చెందాడు.

కందుకూరు: లేమూరు పరిధిలోని రోబోమాటిక్‌ కంపెనీ ఫారెస్ట్‌ ఫెన్సింగ్‌లో చిక్కుక్కున్న జింక పిల్లను గ్రామస్తులు కాపాడారు. మాజీ సర్పంచ్‌ పరంజ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం అటవీ సిబ్బంది అందజేశారు. వీరిలో శ్రీకాంత్‌, కార్తీక్‌, అనిరుధ్‌, ఆకాష్‌, రోబోమాటిక్‌ కంపెనీ సిబ్బంది ఉన్నారు.

తుర్కయంజాల్‌: సర్కిల్‌ పరిధిలోని పలు కాలనీల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. శుక్రవారం కమ్మగూడలోని ఇందిరమ్మ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న కాట్రావత్‌ సంజయ్‌ అనే బాలుడిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. గాయాలపాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

కుటుంబ సభ్యులంతా కలిసి దాయాదిపై దాడి

చికిత్స పొందుతున్న బాధితుడు

యాచారం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ అభ్యర్థి.. తన పరాజయానికి కారణమయ్యాడంటూ ఓ వ్యక్తిని చితకబాదారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని చౌదర్‌పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎనిమిదో వార్డు సభ్యుడిగా పోటీ చేసిన బోద్రమోని రవీందర్‌ 7 ఓట్లతో తేడాతో ఓటమిపాలయ్యాడు. తనకు ఓటేయకపోగా, పరాజయానికి కారణమయ్యాడంటూ దాయాది బోద్రమోని మల్లేశ్‌పై అనుమానం పెంచుకున్నాడు. రెండు రోజులుగా అతని కదలికలపై నిఘా పెట్టాడు. శుక్రవారం ఉదయం మల్లేశ్‌ తన పిల్లలను స్కూల్‌ బస్‌ ఎక్కించేందుకు బైక్‌పై వెళ్తుండగా అడ్డుకున్న రవీందర్‌, అతని తల్లి నాగమణి, తండ్రి నారాయణ, తమ్ముడు రాజేశ్‌ కలిసి చితకబాదారు. తీవ్ర గాయాలైన మల్లేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.

మైనార్టీ విద్యార్థులకు చేయూత 1
1/3

మైనార్టీ విద్యార్థులకు చేయూత

మైనార్టీ విద్యార్థులకు చేయూత 2
2/3

మైనార్టీ విద్యార్థులకు చేయూత

మైనార్టీ విద్యార్థులకు చేయూత 3
3/3

మైనార్టీ విద్యార్థులకు చేయూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement