చదువులో రాణించి.. పాలనకు ఏతెంచి
అబ్దుల్లాపూర్‌మెట్: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని 14 మంది సర్పంచుల్లో ఆరుగురు మహిళా సర్పంచులు విజయం సాధించారు. అందులో ఐదుగురూ విద్యావంతులు కావడంతో పాటు, 35 ఏళ్లలోపు వయసున్న వారే కావడం గమనార్హం. విద్యలో ఉన్నతంగా రాణించిన వీరు, మహిళా ప్రజాప్రతినిధులుగా గెలుపొందడంతో స్థానిక సమస్యలను తెలుసుకుని, పరిష్కరిస్తారనే భావన ప్రజల్లో కనిపిస్తోంది.
ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్
కవాడిపల్లి సర్పంచ్‌గా గెలుపొందిన కొలన్ లక్ష్మీప్రసన్న ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించి, రాజకీయశాస్త్రంలో డాక్టరేట్ సాధనలో ఉన్నారు. అమెరికా, యూరప్‌లో నోవార్టిస్, మైక్రోసాప్ట్ వంటి బహుళజాతీయ సంస్థల్లో పనిచేశారు. ఈమె మామ గతంలో సర్పంచ్‌గా పనిచేశారు.
ఇక ప్రజాప్రతినిధిగా..
ఈమె మందుగుల విజయ. అబ్దుల్లాపూర్‌మెట్ సర్పంచ్‌గా విజయం సాధించారు. త్వరలోనే సర్పంచ్‌గా గ్రామ పాలనా పగ్గాలు అందుకోనున్నారు. ఎంసీఏ పూర్తి చేసిన ఈమె ఇప్పటివరకు గృహిణిగా ఉన్నారు. ఇక ప్రజాప్రతినిధిగా కొనసాగనున్నారు.
ఇంటి నుంచి.. గ్రామ సేవకు
బలిజగూడ గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికై న ఉప్పు మాధవి ఇంటర్ చదివి ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొంది, ప్రజా సేవలో నిమగ్నమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఎంపీటీసీగా ఓడినా..
మజీద్‌పూర్ సర్పంచ్‌గా విజయం సాధించిన మేడిపల్లి ప్రియ బీఎస్సీ, బీఈడీ చదివారు. గతంలో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ ఏమాత్రం అధైర్య పడకుండా సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు.
ఉన్నత విద్యనభ్యసించి..
అనాజ్‌పూర్ సర్పంచ్‌గా ఎన్నికై న రాచపాక నవనీత బీకాం, బీఈడీ చదివారు. ప్రస్తుతం గృహిణిగా ఉన్న ఆమె ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఈమె తోటి కోడలు తాజా, మాజీ ఎంపీటీసీగా పనిచేశారు. తొలి ప్రయత్నంలోనే సర్పంచ్‌గా గెలుపొందిన ఆమె ప్రజా సేవకు సై అంటున్నారు.
చదువులో రాణించి.. పాలనకు ఏతెంచి
చదువులో రాణించి.. పాలనకు ఏతెంచి
చదువులో రాణించి.. పాలనకు ఏతెంచి
చదువులో రాణించి.. పాలనకు ఏతెంచి


