ప్రజలకు అందుబాటులో ఉండండి
దోమ: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కార మార్గం చూపేలా సర్పంచ్‌లు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగి పట్టణంలోని ఆయన నివాసంలో దోమ మండలం గంజిపల్లి సర్పంచ్ కేతావత్ మంజుల, ఆమె పాలకవర్గం మాజీ ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విరక్తితో ఉన్నారన్నారు. ఇందుకు నిదర్శనం స్థానిక సంస్ఠల ఎన్నికలే అన్నారు. దోమ మండలంలో పది సర్పంచ్ స్థానాలు బీఆర్‌ఎస్ కై వసం చేసుకుందన్నారు. ప్రజా ప్రతినిధులు, నూతన సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంజిపల్లి మాజీ సర్పంచ్ కల్పన, బీఆర్‌ఎస్ నేతలు వెంకటేశ్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి


